BIKKI NEWS (JULY 03) : Telangana general transfers guidelines 2024 in telugu. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఉద్యోగులకు సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జీవో నెంబర్ 80 ను విడుదల చేసింది. G.O. NO 80 PDF COPY
TELANGANA GENERAL TRANSFERS GUIDELINES 2024
బదిలీల ప్రక్రియ జులై ఐదున మొదలై జూలై 20 తో ముగియాల్సి ఉంటుంది. అలాగే బదిలీ లపై జూలై 21 – 2024 నుంచి నిషేధం అమలులోకి వస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కింద ఇవ్వడం జరిగింది.
TG TRANSFERS SCHEDULE
జూలై 05 నుంచి 08 : బదిలీలకు సంబంధించిన పూర్తి కార్యాచరణను సంబంధించిన శాఖాధిపతులు సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. తప్పనిసరిగా బదిలీ కావలసిన ఉద్యోగుల జాబితాతో పాటు ఖాళీల వివరాలను పబ్లిష్ చేయాల్సి ఉంటుంది
జూలై – 09 నుండి 12 : బదిలీ కోరుకునే ఉద్యోగులు దరఖాస్తు చేయడంతో పాటు ఆన్లైన్లో ద్వారా ఆప్షన్స్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది
జూలై 13 నుంచి 18 : శాఖాధిపతులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సరైన జాబితాను తయారు చేయవలసి ఉంటుంది
జూలై 19 నుంచి 20 : బదిలీ చేస్తూ ఉద్యోగులకు ఉత్తర్వులు అందజేయాలి ఉత్తర్వులు అందజేసిన మూడవ రోజు నుండి అతను ప్రస్తుత స్టేషన్లో రిలీవ్ అయినట్లుగా పరిగణించాలి
బదిలీల నిబంధనలు
1) జూన్ 30 – 2024 నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేయాలని, కనీసం రెండు సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులకు విజ్ఞప్తి మేరకు బదిలీలు చేయాలని పేర్కొన్నారు. స్పౌజ్కేసులో ఈ నిబంధన వర్తించదు.
2) జూన్ 30 – 2025 నాటికి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు అవకాశం కలిగించారు.
3) సంబంధించిన కార్యాలయంలో పనిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక కేడర్లు 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదు అనే నిబంధనను విధించారు.
4) ఒకే స్థానాన్ని ఇద్దరు కంటే ఎక్కువ ఉద్యోగులు కోరుకున్నప్పుడు కింద నిబంధనల ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది
¡) స్పౌజ్ కేసు విభాగంలో ఒకరిని మాత్రమే బదిలీ చేయవలసి ఉంటుంది.
ii) జూన్ 30 – 2025 నాటికి పదవీ విరమణ పొందే వారికి మినహాయింపు.
iii) 70 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత.
iv) మెంటల్లి రిటార్డ్ పిల్లలు ఉన్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి బదిలీ కాబడే అవకాశం కల్పించడం
v) బదిలీలలో వితంతువులకు ప్రాధాన్యత
vi) ఉద్యోగి లేదా తన మీద డిపెండ్ అయిన పిల్లలు లేదా తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి క్రింది వ్యాధులలో బాధపడుతుంటే వారి వైద్య సౌకర్యార్థం బదిలీలలో ప్రాధాన్యత
A) క్యాన్సర్
B) న్యూరో సర్జరీ
C) కిడ్నీ మార్పిడి
D) కాలేయ మార్పిడి
E) ఓపెన్ హర్ట్ సర్జరీ
F) BONE TB
vii) కష్టతరమైన ప్రదేశాలలో ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులను సంబంధించిన శాఖ గుర్తించాలి.
B) వ్యక్తిగత మరియు వైద్య కారణాల నిమిత్తం బదిలీ అయిన ఉద్యోగుల వాస్తవికతను డిపార్ట్మెంట్ గుర్తించి తదుపరి చర్యలకు గవర్నమెంట్ విన్నవించాల్సి
బదిలీలకు అర్హతలు
1) స్టేషన్ లో పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
2) స్టేషన్ అంటే గ్రామం/ పట్టణం/ నగరంగా యూనిట్ గా తీసుకోవాలి. పని చేసిన కార్యాలయం కాదు.
3) పోకల్ టు నాన్ పోకల్ మరియు నాన్ లోకల్ టూ పొకల్ లను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.
బదిలీల ప్రక్రియ
1) సంబంధిత శాఖలు బదిలీలకు అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాలను, వారి స్టేషన్ సీనియార్టీని ప్రచురించాల్సి ఉంటుంది.
2) ఉద్యోగులు ఆప్షన్స్ పెట్టుకోవడానికి, ఖాళీల వివరాలను కూడా ప్రచురించాల్సి ఉంటుంది
3) కచ్చితంగా బదిలీ చేయవలసిన ఉద్యోగుల జాబితాను కూడా ప్రచురించాల్సి ఉంటుంది.
4) బదిలీ కోరుకునే ఉద్యోగులు కనీసం ఐదు ఆప్షన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
5) కష్టతరమైన పని ప్రదేశాలలో కనీసం ఉద్యోగులు ఉండేలా బదిలీలకు అవకాశం కల్పించాలి
6) కష్టతరమైన పని ప్రదేశాలలోకి ఎవరు బదిలీ కావడానికి ముందుకు రాకపోతే లాటరీ విధానంలో ఉద్యోగులను బదిలీ చేయవలసి ఉంటుంది.
7) బదిలీలను పారదర్శకంగా నిర్వహించడానికి ఆన్లైన్ బేస్డ్ కౌన్సిలింగ్ నిర్వహించాలి.
8) బదిలీలను పూర్తి పారదర్శకంగా జరపడానికి ప్రతి విషయాన్ని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతిలో ప్రచురించాల్సి ఉంటుంది.
కొన్ని శాఖలకు ప్రత్యేక నిబంధనలు
1) ఉపాధ్యాయులు మరియు లెక్చరర్ లకు సంబంధించిన బదిలీల మార్గదర్శకాలను విద్యాశాఖ ప్రత్యేకంగా రూపొందిస్తుంది.
2) ఆదాయాన్ని ఆర్జంచే శాఖలు మార్గదర్శకాలను రూపొందిస్తాయి. అలాగే పోలీస్ శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించుకుంటుంది.