BIKKI NEWS (JULY 08) : Telangana employees transfers guidelines. తెలంగాణ రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా నేపథ్యంలో… బదిలీల నిబంధనలపై ఆర్థిక శాఖ స్పష్టత నచ్చింది 2018లో అనుసరించిన నిబంధనల ప్రకారం బదిలీలు జరుగుతాయని పేర్కొంది.
Telangana employees transfers guidelines
1) నాలుగేళ్లు పూర్తయిన ఉద్యోగి తప్పనిసరిగా బదిలీ అవ్వాల్సి ఉంటుంది.
2) భార్యాభర్తల ఇద్దరూ ఒకే స్థానంలో నాలుగేళ్లు పూర్తయిన తర్వాత కచ్చితంగా స్థానాచల్డం జరుగుతుంది.
3) 2018లో జారీ చేసిన సర్కులర్ మెమో నంబర్ 2934A ప్రకారమే బదిలీల నిబంధనలు అమలు చేయనున్నారు.
4) స్పౌజ్ బదిలీలలో గ్రామాల నుంచి నగరాలకే కాదు, నగరాల నుంచి గ్రామాలకు కూడా బదిలీ చేసే అవకాశం.
5) స్పౌజ్ కేసులో నగరాల నుండి గ్రామీణ ప్రాంతానికి బదిలీ చేసేటప్పుడు ఒకే చోటకి బదిలీ చేయాలి.
6) డిప్యూటేషన్ లో ఎక్కడ పని చేస్తే దాన్ని నాలుగేళ్ల సర్వీస్ గా పరిగణించాలి. కావున డిప్యూటేషన్ చేసిన ప్రాంతానికి మళ్ళీ బదిలీ చేయకూడదు.
6) ఒక కార్యాలయంలో ఒక కేడర్ లో పనిచేస్తున్న వారిలో 40% మందిని మాత్రమే బదిలీ చేయాలి. మొత్తం మంజూరైన పోస్టులలో 40 శాతం కాదు.