Home > BUSINESS > Telangana Budget 2024 – 25 : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024

Telangana Budget 2024 – 25 : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024

BIKKI NEWS (JULY 25) : TELANGANA BUDGET 2024 – 25 LIVE UPDATES. తెలంగాణ రాష్ట్ర 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారు.

TELANGANA BUDGET 2024 – 25 LIVE UPDATES

మొత్తం రూ.2,91,159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు.

ఇక రూ.500 గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కం కోసం రూ.723 కోట్లు, గృహ‌జ్యోతి ప‌థ‌కానికి రూ.2,418 కోట్లు ప్రతిపాదించారు.

  • మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్‌కు రూ.3,385 కోట్లు,
  • హైడ్రాకు రూ.200 కోట్లు,
  • జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్పనకు రూ.3,065 కోట్లు,
  • హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్పనకు రూ.500 కోట్లు,
  • వ్యవ‌సాయానికి రూ.72,659 కోట్లు,
  • ఉద్యాన‌వ‌నం రూ.737 కోట్లు,
  • ప‌శుసంవ‌ర్ధక శాఖ‌కు రూ.1,980 కోట్లు కేటాయించారు.
  • హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి- రూ10 వేల కోట్లు
  • మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు- రూ.1500 కోట్లు
  • ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- రూ1525 కోట్లు
  • పాత‌బ‌స్తీ మెట్రో విస్త‌ర‌ణ‌కు- రూ.500 కోట్లు
  • మ‌ల్టీ మోడ‌ల్ స‌బ‌ర్బ‌న్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్- రూ.50 కోట్లు
  • ఔట‌ర్ రింగ్ రోడ్డుకు- రూ.200 కోట్లు
  • హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు- రూ.500 కోట్లు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు