BIKKI NEWS (NOV. 15) : team india won series against south africa. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టీట్వంటీ లో టీమిండియా 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ ను 3 – 1 తేడాతో గెలుచుకుంది. ఈ ఏడాది ఒక్క టీట్వంటీ సిరీస్ ను కూడా టీమిండియా కోల్పోలేదు.
team india won series against south africa
284 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టబ్స్ – 43, మిల్లర్ – 36, యన్ సేన్ – 40 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ – 3, అక్షర్ పటేల్, చక్రవర్తి తలో రెండు,. హర్దిక్, రమణ్‌దీప్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
టీమిండియా బ్యాట్స్ మన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. భారీ సిక్సర్స్ తో విరుచుకుపడ్డారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో వికెట్ కోల్పోయి 283 పరుగులు సాదించింది.
సంజూ శాంసన్ సెంచరీ (109) మరియు తిలక్ వర్మ సెంచరీ (120) లతో రాణించడంతో భారత్ భారీ స్కోరు ను సాదించింది. సంజూ శాంసన్ కు గత 5 అంతర్జాతీయ టీట్వంటీ లలో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అలాగే తిలక్ వర్మకు వరుసగా రెండో టీట్వంటీ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. అలాగే వరుసగా రెండు మ్యాచ్ లలో సెంచరీలు కొట్టిన రెండో భారత బ్యాట్స్‌మన్ గా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. మొదటి భారత బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్.
ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 23 సిక్సర్స్ కొట్టిన టీమిండియా బ్యాట్స్ మన్ గతంలో బంగ్లాదేశ్ పై కొట్టిన అత్యధిక సిక్సర్ల (22) రికార్డు ను బద్దలు కొట్టారు.
సంక్షిప్త స్కోర్
టీమిండియా : 283/1
అభిషేక్ శర్మ – 36 (18)
సంజూ శాంసన్ – 109* (56)
తిలక్ వర్మ – 120* (47)
సౌతాఫ్రికా : 148/10