ICC T20 WC – INDIA IN FINALS

BIKKI NEWS (JUNE 28) : TEAM INDIA REACHES FINALS IN ICC T20 WORLD CUP 2024. టీమిండియా ఐసీసీ t20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ కు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను సెమీస్ లో 68 పరుగుల భారీ తేడాతో ఓడించి ఫైనల్ కు చేరింది. TEAM INDIA REACHES T20 WC FINALS.

మొత్తం మీద టీమిండియా టి20 వరల్డ్ కప్ లలో మూడోసారి ఫైనల్ కు చేరింది. 2007లో మొదటి టి20 వరల్డ్ కప్ ను ధోని నేతృత్వంలో గెలుచుకుంది. 2014 లో శ్రీలంక చేతిలో ఫైనల్ లో ఓటమి పాలయ్యారు.

TEAM INDIA REACHES T20 WC FINALS

2007లో మొదటి టి20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా మరోసారి కప్ నెగ్గేందుకు జూన్ 29న సౌతాఫ్రికా తో తలపడనుంది.

టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (57), సూర్య కుమార్ యాదవ్ (47) హార్దిక్ పాండ్యా (23) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులను సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డాన్ 3 వికెట్లు తీశాడు. టాప్లీ, ఆర్చర్ శామ్ కర్రన్, రషీద్ తలో వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత స్పిన్ దాటికి కాకావికలమైంది.. అక్షర పటేల్ 3, కులదీప్ యాదవ్ మూడు, బుమ్రా – 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచారు. దీంతో భారత్ ఫైనల్స్ కు చేరింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లలో అర్చర్ -21 , బ్రూక్ 25, కెప్టెన్ బట్లర్ – 23 పరుగులతో మాత్రమే రాణించారు. దీంతో ఇంగ్లండ్ 16.3 ఓవర్లలో 103/10 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత జట్టు జూన్ 29న జరిగే ఐసీసీ t20 వరల్డ్ కప్ ఫైనల్ 2024 లో సౌతాఫ్రికా తో తలపడనుంది. సౌత్ ఆఫ్రికా జట్టు ఐసిసి టోర్నీ ఫైనల్స్ కు చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అక్షర్ పటేల్ నిలిచాడు. కీలకమైన మూడు వికెట్లను తీశాడు. కుల్దీప్ యాదవ్ టీట్వంటీ లలో 200 వికెట్ల మైలురాయి ని చేరుకున్నాడు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు