BIKKI NEWS (MARCH 12) : తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లీ (TEACHERS TRANSFERS and PROMOTION 2024 ) ప్రారంభం కానున్నాయి. ఈ అంశాలపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టిజోన్ – 2 లోని హెచ్‌ఎం ల పదోన్నతులపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమమైంది.
జీవో – 317లో భాగంగా ఇతర జిల్లాల టీచర్లు రంగారెడ్డికి బదిలీ కాగా, రంగారెడ్డి జిల్లాలోని టీచర్లకు సీనియారిటీ జాబితాలో అన్యాయం జరిగిందని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టిజోన్ -2లో హెచ్‌ఎంల పదోన్నతులకు బ్రేక్‌పడింది. దీంతో బదిలీలు, మిగతా పదోన్నతులు చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కోర్టు స్టేను ఎత్తివేయడంతో పదోన్నతులకు అనుమతి లభించింది.