చౌటుప్పల్ (జనవరి – 26) : చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని ప్రాథమిక పాఠశాలలో డిప్యుటేషన్ పై ఉన్న ఉపాధ్యాయుడు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి (ఎస్జీటీ)ని విధుల నుంచి తొలగిస్తూ (TEACHER SUSPENSION);ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎంఈవో శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
లక్కారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉండే నిరంజన్ రెడ్డిని ఉపాధ్యాయుల పని సర్దుబాటులో భాగంగా డిప్యుటేషన్ పై మల్కాపురం పాఠశాలకు పంపగా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజరైనట్టు, తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్టు విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ నివేదిక ప్రకారం విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు.
డిప్యుటేషన్ పై వచ్చిన ఈ ఉపాధ్యాయుడి బోధన సేవలను వినియోగించుకోనందుకు, ఇతను గైర్హాజరు వివరాలను ఉన్నతాధికారులకు పంపనందుకు మల్కాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాస్ కు ఛార్జ్ మెమో జారీ చేసినట్టు వివరించారు.