Home > JOBS > SSC > SSC : 2,049 ఉద్యోగాలకై నోటిఫికేషన్

SSC : 2,049 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS : STAFF SELECTION COMMISSION RECRUITS 2049 POSTS – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లోని 2,049 పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.

పోస్టుల వివరాలు : లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్ మాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్మన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్ -కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్ వైజర్, సీనియర్ ట్రాన్స్లేటర్, స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్ తదితరాలు.

అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనిష్ఠంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా పోస్ట్ ను అనుసరించి కలవు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్- టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ₹100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)

పరీక్ష విధానం :

జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు, 50 మార్కులు),
జనరల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు, 50 మార్కులు),
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్మెటిక్ స్కిల్) (25 ప్రశ్నలు, 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) (25 ప్రశ్నలు, 50 మార్కులు).

ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు గడువు : 26.02.2024 నుంచి 18.03.2024 వరకు.

ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2024.

దరఖాస్తు ఎడిట్ అవకాశం : 22. 03. 2024 నుంచి 24.03.2024 వరకు.

పరీక్ష తేదీలు : మే 06 నుంచి 08 – 2024 వరకు.

నోటిఫికేషన్ & సిలబస్ : Download Pdf

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://ssc.gov.in/