SSC MTS JOBS – పదో తరగతితో 8,326 ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 28) : SSC MTS and HAVALDAR JOB NOTIFICATION 2024 RELEASED. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు హవల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇ నోటిఫికేషన్ ద్వారా 8,326 MTS మరియు హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొదటి సారిగా SSC MTS, హవల్దార్ పరీక్ష ను తెలుగు తో సహా15 భాషలలో నిర్వహించనున్నారు.

SSC MTS and HAVALDAR JOB NOTIFICATION

పోస్టుల వివరాలు : MTS – 4887, హవల్దార్ – 3,439

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ పద్దతిలో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ : జూన్ 27, 2024 నుండి.

దరఖాస్తు చివరి తేదీ : జూలై 31, 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : ఆగస్ట్ – 16 నుంచి 17వ తేదీ వరకు

SSC MTS 2024 పరీక్ష : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (టైర్ 1) అక్టోబర్-నవంబర్ 2024 నిర్వహించనున్నారు.

దరఖాస్తు రుసుము : రూ. 100/- రూపాయలు. (SC /ST/ PWD/ Ex- servicemen వర్గానికి చెందిన అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు)

వయోపరిమితి : MTS ఉద్యోగాలకు 18-25 సంవత్సరాలు మరియు హవల్దార్‌ పోస్టుకు 18-27 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది)

విద్యార్హత : మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

ఎంపిక విధానం : ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) (హవాల్దార్ పోస్టుకు మాత్రమే) ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, గుంటూరు, చీరాల.

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://ssc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు