BIKKI NEWS (NOV. 04) : special officers for paddy procurement. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది.
special officers for paddy procurement
రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సీఎంగారు ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.
ప్రత్యేకాధికారులు :
ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కృష్ణ ఆదిత్య గారు.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు ఆర్వీ కర్ణన్ గారు.
నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేటకు అనితా రామచంద్రన్ గారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు డా. ఏ.శరత్ గారు.
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు డి. దివ్య గారు.
మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ మరియు నాగర్‌కర్నూల్ జిల్లాలకు రవి గారు.
వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు టి. వినయ కృష్ణా రెడ్డి గారు.
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు హరిచందన దాసరి గారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కె. సురేంద్ర మోహన్ గారు.