Nethanna – నేతన్నల బకాయిలు తీరుస్తాం – మంత్రి పొన్నం

BIKKI NEWS (APRIL 08) : ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల చేనేత కార్మికుల జేఏసి సమావేశంలో పాల్గొని, నేతన్నలకు తోడుగా అండగా(Siricilla Nethanna dues wi clear soon) మా ప్రభుత్వం ఉంటుందని హమీ ఇచ్చారు.

తాము అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుందని, నేతన్నల బకాయిలు ఉన్నాయని, వాటిని త్వరలోనే తీరుస్తామని హమీ ఇచ్చారు. మొదటి శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చుపెట్టినమని, ప్రణాళిక పరమైన విధానాలు లేకపోవడం వల్ల 60 వేల కోట్లు 60 సంవత్సరాల్లో చేస్తే 7 లక్షల కోట్లు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేశారని తెలిపారు.

కొత్త ఆర్డర్లు తీసుకొస్తున్నామని, గత 10 సంవత్సరాలుగా మీ చేతికి ఇచ్చిన పని కంటే ఎక్కువనే ఇస్తామని స్పష్టం చేశారు.