BIKKI NEWS (MARCH 14) : శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు (SHG STALLS BESIDE SILPARAMAM) ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం.
2017 నుంచి నిరుపయోగంగా ఉన్న నైట్ బజార్ లోని 119 స్టాల్స్ ను ఇందుకు ఉపయోగించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం. రైతు బజార్ లా స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేలా స్టాల్స్ ను తీర్చి దిద్దాలని అధికారులకు దిశానిర్ధేశం
పూర్తిగా మహిళలకు మాత్రమే స్టాల్స్ ను కేటాయించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. వీలైనంత త్వరగా ఉత్తర్వులను జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశం అవసరమైతే మణిపూర్ లోని మహిళలకు కేటాయించిన మార్కెట్ ను అధ్యయనం అధికారులకు సూచన మహిళా శక్తి పథకంలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం.