CAST SURVEY ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలపై స‌మ‌గ్ర సర్వే

BIKKI NEWS (OCT. 11) : SC ST BC cast survey in Telangana. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలపై స‌మ‌గ్ర గ‌ణ‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వే చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం జీవోలో పేర్కొంది.

SC ST BC cast survey in Telangana

ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలపై సామాజిక‌, ఆర్థిక‌, విద్య అంశాల‌పై స‌ర్వే చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి శాంతి కుమారి వెల్ల‌డించారు.

ఉద్యోగ‌, రాజ‌కీయ‌, కుల అంశాల‌పై స‌ర్వే చేయ‌నున్న‌ట్లు తెలిపారు. స‌ర్వే బాధ్య‌త‌ను ప్ర‌ణాళిక శాఖ‌కు అప్ప‌గిస్తున్న‌ట్లు సీఎస్ శాంతి కుమారి వెల్ల‌డించారు. 60 రోజుల్లో స‌ర్వే పూర్తి చేయాల‌ని జీవోలో పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు