BIKKI NEWS (JAN. 08) : Sansad Rathna Awards 2023 కు ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఎంపికయ్యారు. చెన్నైకు చెందిన ప్రైమ్ ఫౌండేషన్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010లో ఆయన చేతుల మీదు గానే ఈ అవార్డులను ప్రారంభించింది.
బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్, శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా, ఎన్సీపీ ఎంపీ అమోల్ రాంసింగ్ కొల్లే, కాంగ్రెస్ ఎంపీ రాజ్ శర్మ లకు ఈ అవార్డునకు నిర్వాహకులు ఎంపిక చేశారు.
రాజధానిలో ఫిబ్రవరి 17న నిర్వహించే కార్యక్రమంలో వీరికి బహుమతులు అందజేస్తామని వారు చెప్పారు. జ్యూరీ కమిటీ మెంబర్స్ బృందం ఎంపీల సమగ్ర పనితీరును పరిశీలించి పార్లమెంట్ లో ప్రతిభ కనబర్చిన సభ్యులను ప్రతి ఏడాది ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. అలాగే లోక్సభ కాలపరిమితి ఐదేండ్ల పాటు స్థిరమైన ప్రజ్ఞను ప్రదర్శించిన సభ్యునికి సంసద్ మహారత్న అవార్డు అందజేస్తారు.