BIKKI NEWS (APR. 10) : salary not credited for gurukula employees up to 10th april. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల సొసైటీలలో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందికి మార్చి నెల సంబంధించిన వేతనాలు ఈరోజుటి వరకు కూడా జమ కాలేదు. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
salary not credited for gurukula employees up to 10th april
మొదటి తారీకు జీతాలు చెల్లించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం గురుకులాల విషయంలో అమలు చేయలేకపోవడంపై గురుకుల సొసైటీల ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా ప్రతి నెల మొదటి తారీకున వేతనాలు అందించాలని తద్వారా పేర్కొన్నారు
గురుకుల సొసైటీలలో సకాలంలో శాలరీ బిల్లు లు లో సబ్మిట్ చేయకపోవడం వలనే వేతనాలు ఆలస్యం అవుతున్నాయని ఆరోపణ కూడా ఉంది.
వేతనాలు ఆలస్యంగా చెల్లించడం వలన ఈఎంఐలు ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని, కావున సకాలంలో వేతనాలు చెల్లించాలని ఉద్యోగ సంఘ నాయకులు పేర్కొంటున్నారు.
అలాగే సకాలంలో ఈఎంఐ లు చెల్లించకపోవడం వలన సిబిల్ స్కోర్ పై ప్రభావం పడి భవిష్యత్తులో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు పొందేందుకు తాము అనర్హులుగా మారుతున్నామని కూడా ఈ సందర్భంగా వాళ్లు వాపోయారు.
మరోవైపు గురుకుల సొసైటీలలోని పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. వారి వేతనాలు కూడా సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు.
- SBI FELLOWSHIP : నెలకు 19 వేలు అందించే ఎస్బీఐ ఫెలోషిప్
- UoH PhD Admissions 2025 -హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లు
- JEE MAINS (II) KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి
- ఉద్యోగి జీవితంలో సర్వీస్ విషయాలపై అవగాహన చాలా ముఖ్యం
- FREE ONLINE TEST 25 – ఉచిత ఆన్లైన్ టెస్టు