BIKKI NEWS (MAY 01) : రైతుబంధు సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాల్లో వేయలేకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి (Rythu bandhu amount back to govt accounts) వస్తున్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 19,000 మంది రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన రైతుబంధు సొమ్ము బ్యాంకుల వరకు తిరిగి వెనక్కి వచ్చినట్లు సమాచారం. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతుబంధు సొమ్ము వెనక్కి వచ్చినట్టు లెక్కలు తీసిన వ్యవసాయ శాఖ అధికారులు వాటిని ఇంకా పూర్తిస్థాయిలో సరిదిద్దలేదు. దీంతో రైతుబంధు చెల్లింపులు ఇంకా ఆలస్యం అవుతున్నాయి.
కారణాలు ఇవే…
ఇలా రైతుబంధు సొమ్ము వెనక్కి సర్కారు ఖాతాలోకి వెళ్లడానికి గల కారణాలు పరిశీలిస్తే…
రైతుల ఇంటిపేర్లు, పేర్లు బ్యాంకు ఖాతాల నెంబర్లు సరిచూసుకోకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం.
ఎక్కడ ఒక అక్షరం తప్పు ఉన్న బ్యాంకులు తిరిగి సొమ్ము తిరిగి వెనక్కి వేస్తున్నాయి.
కొందరు రైతు బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, కొందరు డిపాజిటర్లుగా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవడం, రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.