BIKKI NEWS (MAY 19) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు విద్యా శాఖపై సమీక్షించనున్నారు. విద్యాశాఖ అధికారులతోపాటు విశ్వవిద్యాలయాల వీసీలు కూడా ఈ సమావేశానికి (REVIEW MEETING ON EDUCATION DEPARTMENT BY CM REVANTH REDDY) హాజరవుతారు.
జూన్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. పాఠశాలలు, కాలేజీల్లో వసతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలు, విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేయడం వంటి అంశాలపై చర్చించే అవకాశమున్నది.
అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి కూడా చర్చకు రానుంది.