BIKKI NEWS (AUG. 08) : REQUESRING FOR DISTURBED CJLS TRANSFERS. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా కమీషనర్ శ్రీమతి శృతి ఓజ (IAS) గారిని ఈరోజు హైదరాబాద్ ఇంటర్ విద్య కమిషన్ ఆఫీస్ వద్ద కలిసి పల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ -475 రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు
REQUESRING FOR DISTURBED CJLS TRANSFERS
ఇంటర్ విద్యలో నిర్వహించిన అధ్యాపకుల ఉద్యోగుల సాధారణ బదిలీలను ఎంతో పారదర్శంగా నిర్వహించినందుకు తమ సంఘం తరఫున డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని తెలుపుతూ… ఈ సందర్భంగా డిస్టర్బ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు తిరిగి వేరే కళాశాల అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని తెలిపారు. అదే విధంగా రెన్యువల్ ముగిసిన గెస్ట్ లెక్చరలను వెంటనే రెన్యూవల్ పొడిగించి మల్టీ జోన్ లో ఎక్కడ ఉన్న అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చరిత్ర మరియు పౌరశాస్త్రం పోస్టులు వేర్వేరుగా బోధించడానికి సాంక్షన్ చేయవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. సాధారణ బదిలీలలో అవకాశం రాని అధ్యాపకులకు గౌట్ మెమో ప్రకారం అప్లై చేయడానికి పోర్టల్ సౌకర్యం కల్పించవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ డైరెక్టర్ గారు సమస్యలు పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర జిల్లా నాయకులు రజియా సుల్తానా, సిలువేరు లింగమూర్తి, గణపతి ,పాతూరు రాజిరెడ్డి, వెంకట్ రెడ్డి, రాజేందర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు