BIKKI NEWS (DEC. 18) : RAVICHANDRAN ASHWIN RETIREMENT. భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.మ అంతర్జాతీయ క్రికెట్‌కు ఈరోజు వీడ్కోలు పలికారు.
RAVICHANDRAN ASHWIN RETIREMENT
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడవ టెస్టు చివరి రోజు అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు.
టెస్టు కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా, ప్రపంచంలో 7వ బౌలర్ గా, అశ్విన్ నిలిచాడు. అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసుకున్నాడు. అనిల్ కుంబ్లే132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
టెస్టులో 5 వికెట్ల ప్రదర్శన 37 సార్లు చేసి షేన్ వార్న్ తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో మురళీధరన్ (67) ఉన్నాడు.
అశ్విన్ టెస్టుల్లో 3,503 రన్స్ చేశాడు. దాంట్లో 6 సెంచరీలు, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ ఆల్‌రౌండర్లలో అశ్విన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మూడు వేల రన్స్, 300 వికెట్లు తీసిన 11 మంది ఆల్‌రౌండర్ల లిస్టులో అతను ఉన్నాడు.
అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డే లు, 65 టీట్వంటీ మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్ లు కలిసి 4400 పరుగులు, 765 వికెట్లు తీశాడు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19 – 12 – 2024
- GK BITS IN TELUGU 19th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 19
- GDP FORECAST 2024 – వివిధ సంస్థల అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి రేట్
- TG TET 2024 – టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల