BIKKI NEWS (APR. 04) : Rajiv Yuva vikasam scheme new guidelines. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న కుంటున్న అభ్యర్థులకు రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే చాలని… ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు స్పష్టం చేశారు.
Rajiv Yuva vikasam scheme new guidelines
రేషన్ కార్డు లేదా ఆదాయ ఆహార భద్రతా కార్డు లేని పౌరులు మాత్రమే మీ సేవ కేంద్రంలో జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం యొక్క నెంబర్ ను ఆన్లైన్ దరఖాస్తులో ఎంటర్ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
2016 నుండి కుల ధ్రువీకరణ పొందిన పౌరులు ఆ కుల ధ్రువీకరణ పత్రంతోనే దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అంతకంటే ముందు కుల దృవీకరణ పత్రం తీసుకున్న వారు మాత్రం నూతనంగా కుల ధ్రువీకరణ పత్రాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దరఖాస్తు గడువు ఎప్రిల్ 14 వరకు కలదు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.