RAFAEL NADAL – ఆటకు వీడ్కోలు పలికిన రఫెల్ నాదల్

BIKKI NEWS (OCT. 11) : Rafael Nadal announces retirement from tennis. స్పెయిన్‌ బుల్‌గా టెన్నిస్‌ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజుగా ఏలిన రఫెల్‌ నాదల్‌ తన టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాల పాటు ప్రపంచ క్రీడాభిమానులను తన అద్భుత ఆటతీరుతో అలరించిన నాదల్‌..ఆటకు ఇక సెలవంటూ ప్రకటించాడు.

Rafael Nadal announces retirement from tennis

ఓపెన్‌ ఎరాలో 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో తిరుగులేని టెన్నిస్‌ తారగా మన్ననలు పొందిన నాదల్‌..ఫ్రెంచ్‌ ఓపెన్‌పై చెరుగని ముద్రవేశాడు. అసలు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో 14 టైటిళ్లతో క్లే కింగ్‌ అన్న గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు

నాదల్‌ ఘనతలు

  • 19 ఏండ్ల వయసులో నాదల్‌..తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ఫెదరర్‌, మారియానో ప్యుయెర్టాను ఓడించి..సంప్రాస్‌ (15 ఏండ్లు) తర్వాత పిన్న వయసు గ్రాండ్‌స్లామ్‌ విజేతగా నిలిచాడు.
  • అత్యధిక(14) సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌గా నాదల్‌ రికార్డు నెలకొల్పాడు. 2005 నుంచి 14 వరకు పదింటిలో 9సార్లు టైటిల్‌ సొంతం చేసుకున్నాడు.
  • 18 ఏండ్ల వయసులో(2004) డేవిస్‌ కప్‌ ఫైనల్లో అండీ రాడిక్‌ను ఓడించి స్పెయిన్‌కు టైటిల్‌ అందించడంలో కీలకమయ్యాడు.
  • నాదల్‌, ఫెదరర్‌ మధ్య జరిగిన 2008 వింబుల్డన్‌ ఫైనల్‌ టెన్నిస్‌ చరిత్రలో గ్రేటెస్ట్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌గా నిలిచిపోయింది.
  • 2010లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ గెలిచిన నాదల్‌..కెరీర్‌ గోల్డెన్‌ స్లామ్‌ పూర్తి చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.
  • బీజింగ్‌(2008) ఒలింపిక్స్‌లో నాదల్‌ తొలిసారి స్వర్ణం గెలిచాడు. ఫైనల్లో గొంజాలెజ్‌ను ఓడించి స్పెయిన్‌కు పసిడి అందించాడు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు