డిస్టర్బ్ అయిన కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్స్ ను తిరిగి నియమించాలి.

  • ఇంటర్ విద్య డైరెక్టర్ కు TGJLA 475 విన్నపం

BIKKI NEWS (AUG. 02) : Posting to Disturbed contract and guest lecturers. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల బదిలీల వలన డిస్టర్బ్ అయిన కాంట్రాక్టు మరియు గెస్ట్ లెక్చరర్స్ వెంటనే వేరే కళాశాలలో అడ్జస్ట్ చేయవలసిందిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా డైరెక్టర్ శ్రీమతి శృతి ఓజాగారికి ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ప్రభుత్వ ఇంటర్ విద్యలో నిర్వహించిన అధ్యాపకుల బదిలీల వలన గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్ట్/గెస్ట్ లెక్చరర్స్ డిస్టర్బ్ కావడం జరిగిందని, వీరిని వేరే కళాశాలలో అడ్జస్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 1300 పైగా గెస్ట్ లెక్చరర్ల రెన్యువల్ 31/07/2024 తేదీతో ముగిసిందని, చాలా కళాశాలలో అధ్యాపకుల కొరతతో విద్యార్థులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉందని తెలుపుతూ… వీరి రెన్యువల్ కాల పరిమితి పొడిగించాలని…గతంలో మరియు ప్రస్తుత అధ్యాపకుల సాధారణ బదిలీల వలన డిస్టర్బ్ కాబడిన గెస్ట్ లెక్చరర్ లకు మల్టీ జోన్ లో ఎక్కడ అవకాశం ఉన్న తిరిగి అడ్జెస్ట్ చేయవలసిందిగా వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు