PM INTERNSHIP SCHEME – పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం రిజిస్ట్రేషన్ ప్రారంభం

BIKKI NEWS (OCT. 13) : pm internship 2024 registration link. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు.

pm internship 2024 registration

దేశంలోని ప్రసిద్ధ 500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్ చేయడానికి 21 నుంచి 24 ఏళ్ల వయస్సు గల యువత దీని కోసం అప్లై చేయవచ్చు. దీని ఇంటర్న్‌షిప్ వ్యవధి 12 నెలలు. ఇంటర్న్‌షిప్ వ్యవధిలో కనీసం సగం తరగతి గదిలో కాకుండా వాస్తవ పని అనుభవం లేదా ఉద్యోగ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది.

ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

అర్హతలు : 10, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా లేదా BA, B.Sc., B.Com, BCA, BBA, B. ఫార్మా చదివిన 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పథకంలో కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానం వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం : అర్హతగల అభ్యర్థులు ఈ లింక్ ద్వారా (https://pminternship.mca.gov.in/login/) ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

స్టైఫండ్ వివరాలు :

ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతి ఇంటర్న్ స్టైపెండ్‌గా రూ. 5,000/- పొందుతారు. ఇందులో రూ.4,500/- కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రూ. 500/- కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంబంధిత కంపెనీ ఇస్తుంది.

ప్రతి ఇంటర్న్ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేయబడతారు.

దరఖాస్తు గడువు : అక్టోబర్ 12 నుంచి నవంబర్ 15 వరకు కొనసాగుతుంది.

దరఖాస్తు కోసం అవసరమైన సర్టిఫికెట్ లు

దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేస్తున్నప్పుడు అక్టోబర్ 11 నాటికి రిజిస్టర్ అయిన కంపెనీలలో ఇంటర్న్‌షిప్ కోసం ప్రతి ఇంటర్న్‌కు గరిష్టంగా ఐదు ఎంపికలు ఇవ్వబడతాయి.

ఈ రంగాల్లో అవకాశాలు

గత మూడేళ్ల CSR ఖర్చుల సగటు ఆధారంగా అగ్రశ్రేణి కంపెనీలను గుర్తించారు. గ్యాస్, చమురు, ఇంధన రంగానికి ఇంటర్న్‌షిప్ పథకంలో నమోదు కోసం గరిష్ట అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత టూర్-ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయి.

వెబ్సైట్ : https://pminternship.mca.gov.in/login/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు