BIKKI NEWS (JULY 26) : PARIS OLYMPIC GAMES 2024 INFORMATION FOR EXAMS.. ప్రపంచ అతిపెద్ద క్రీడా సరంభం ఒలింపిక్స్ 2024 క్రీడలు పారిస్ది వేదికగా నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఆధునిక ఒలంపిక్స్ క్రీడల్లో పారిస్ ఒలంపిక్స్ 33వ క్రీడలు.
PARIS OLYMPIC GAMES 2024 INFORMATION FOR EXAMS
పారిస్ ఒలింపిక్స్ 2024 మస్కట్ ప్రీజెస్. ప్రాన్స్ చారిత్రక, సాంప్రదాయక టోపీలు అయినా ప్రిజేయన్ టోపీలను దృష్టిలో పెట్టుకొని మస్కట్ ను తయారు చేశారు.
ఒలంపిక్స్ క్రీడల ఆరంభ వేడుకలను సాధారణంగా ప్రధాన స్టేడియంలో నిర్వహిస్తారు. కానీ ఈసారి ఆరంభ వేడుకలను పారిస్ నగరంలోని సెన్ నది లో నిర్వహించనున్నారు. ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది.
ఒలింపిక్స్ నిర్వహణ లో లండన్ 3 సార్లు తర్వాత పారిస్ కూడా 3 సార్లు నిర్వహించనుంది.
మొత్తం 32 క్రీడాంశాలలో 329 మెడల్స్ కోసం దాదాపు 10,500 మంది క్రీడాకారులు 206 దేశాల నుంచి పాల్గొంటున్నారు. పారిస్ ఒలంపిక్స్ అంచనా వ్యయం 1.17 లక్షల కోట్లు గా ఉంది.
భారతదేశం 16 క్రీడాంశాలలో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.
గత టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం 7 పతకాలతో రికార్డు సృష్టించింది. ఈసారి డబుల్ డిజిట్ లక్ష్యంగా భారత క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.
ఒలంపిక్స్ చరిత్రలో భారత సాధించిన మొత్తం పథకాల సంఖ్య 35.ఇందులో 10 స్వర్ణాలు ఉండటం విశేషం. ఎనిమిది హాకీ జట్టు సాధించగా, వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా ఒక స్వర్గం, నీరజ్ చోప్రా మరో స్వర్ణం సాధించారు.
గత టోక్యో ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు, నీరజ్ చోప్రా, మీరా బాయ్ చాన్ , దహియా, బజరంగ్ పూనియా, పీవీ సింధు, లవ్లీనా లు పతకాలు సాదించారు. ఈసారి వీరిలో దహియా, బజరంగ్ పూనియా లు అర్హత సాదించలేదు.