BIKKI NEWS (OCT. 31) : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారు 2024 – 245విద్యా సంవత్సరానికి దూరవిద్య అడ్మిషన్లకు (osmania university distance education admissions 2024) నోటిఫికేషన్ జారీ చేశారు.
osmania university distance education admissions 2024
డిగ్రీ, పేజీ, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సులకు దూరవిద్య ద్వారా పొందడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.
కోర్సుల వివరాలు: ఎంబీఏ, ఎంసీఏ; ఎంఏ: హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ; ఎంఎస్సీ: మ్యాథ్స్, స్టాటిస్టిక్స్; ఎంకాం, బీఏ; బీకాం; బీబీఏ; అడ్వాన్స్‌డ్ డిప్లొమా: మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షప్ డెవలప్‌మెంట్, వేదిక్ ఆస్ట్రాలజీ; అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా: వేదిక్ ఆస్ట్రాలజీ; సర్టిఫికేట్ కోర్సు: యోగా.
అర్హతలు : కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫేజ్-1 అడ్మిషన్లకు గడువు : నవంబర్ 15 – 2024