Home > EMPLOYEES NEWS > OU NEWS : 60 ఏళ్ళు దాటినా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు

OU NEWS : 60 ఏళ్ళు దాటినా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు

హైదరాబాద్ (అక్టోబర్ – 02) : ఓయూ పరిధిలో పని చేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను 60 సంవత్సరాలు దాటితే విధుల నుంచి తొలగించాలని రిజిస్ట్రార్ ప్రొ. లక్ష్మీనారాయణ, అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. వయస్సు నిర్ధారణ కోసం ఉద్యోగుల నుంచి బర్త్ సర్టిఫికెట్లు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేశారు.

ఇదిలా ఉండగా పర్మనెంట్ ఉద్యోగుల తరహాలో కాంట్రాక్టు ఉద్యోగులను కూడా 61 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగించాలని పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు వీసీ ప్రొ.రవీందరు కోరారు.

★ ఓయూకు గ్రూప్-4 ఉద్యోగులు

ఓయూకు ఇక నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ (బోధనేతర ఉద్యోగులు)ను టీఎస్పీఎస్సీ గ్రూప్-4లో ఎంపికైన అభ్యర్థులను నియమించనున్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం ప్రభుత్వం వర్సిటీల నాచింగ్ స్టాఫ్ భర్తీపై ప్రభుత్వం ఆరా తీసింది. గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ వచేసి కొనసాగించేవారు. కాంట్రాక్టు నియామకాల పై అధ్యాయనం చేసిన ప్రభుత్వ అధికారులు అవి పారదర్శకంగా లేవని 2014 నుంచి ఓయూలో కాంట్రాక్టు నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను రద్దు చేశారు.

త్వరలో వెలువడనున్న గ్రూప్-4 పరీక్ష ఫలితాలలో విజయం సాధించిన అభ్యర్థులలో సుమారు 350 మంది పర్మనెంట్ ఉద్యోగులు దసరా పండుగ వరకు ఓయూకు రానున్నట్లు సమాచారం.