BIKKI NEWS (MARCH 29) : తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 విధులలో పాల్గొన్న ఆఫీసర్లు మరియు సిబ్బందికి ఒక నెల గ్రాస్ శాలరీని వేతనంగా చెల్లించాలని (one month gross salary for election duty) రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
2023 నవంబర్ – డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న అన్ని రకాల సిబ్బందికి రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని వేతనంగా అందించాలని ఇంతకుముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.