Home > EMPLOYEES NEWS > ఉద్యోగులతో చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఉద్యోగులతో చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం

BIKKI NEWS (MAY 06) : Officers committee on employees issues in telangana. తెలంగాణ ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలపై చర్చించడానికి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Officers committee on employees issues in telangana

తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని తీర్మానం చేసింది. తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు… ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణా భాస్కర్ పేర్లతో కూడిన కమిటీ ఉద్యోగులతో చర్చించనుంది

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ప్రతిరోజు భేటీ కావడం వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించడం, వాటిని పరిశీలించి, రిపోర్టును వారం రోజుల్లో అందజేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు