Home > EMPLOYEES NEWS > NPS – బేసిక్ పే లో 50% ఫించన్ – కేంద్రం యోచన

NPS – బేసిక్ పే లో 50% ఫించన్ – కేంద్రం యోచన

BIKKI NEWS (JUNE 12) : ఉద్యోగులకు జాతీయ పింఛను పథకం (NPS)లో భాగంగా ఉద్యోగుల చిట్ట చివరి బేసిక్ పే లో 50% పింఛనుగా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రాథమికంగా (nps pension 50% in basic pay) ప్రతిపాదించింది.

NPS పై అభ్యంతరాలు, పలు రాష్ట్రాలు తిరిగి పాత పింఛను విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో 2023లో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్ పీఎస్ ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులకు చిట్టచివరి బేసిక్ పే లో 50% మొత్తాన్ని పింఛనుగా ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఎన్ పీ ఎస్ లో మార్పులు చేయాలని కూడా సోమనాథన్ కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే.. కమిటీ తన సిఫారసులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ఠ గడువు విధించలేదు.