Home > SPORTS > PARIS OLYMPIC GAMES 2024 > NEERAJ CHOPRA – రజతం నెగ్గిన నీరజ్ చోప్రా

NEERAJ CHOPRA – రజతం నెగ్గిన నీరజ్ చోప్రా

BIKKI NEWS (AUG. 09) : NEERAJ CHOPRA WON SILVER MEDAL IN PARIS OLYMPICS. నీరజ్‌ చోప్రా పారిస్‌ ఒలింపిక్స్ లో రజతంతో మెరిశాడు. స్టేట్‌ డి ఫ్రాన్స్‌ వేదికగా గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌ రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. గత టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే.

NEERAJ CHOPRA WON SILVER MEDAL IN PARIS OLYMPICS

పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ ఒలింపిక్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 92.97 మీటర్ల రికార్డు త్రో తో పసిడి సొంతం చేసుకున్నాడు. కెన్యా అథ్లెట్‌ పీటర్స్‌ అండర్సన్‌ 88.54 మీటర్ల దూరం విసిరి కాంస్యం గెలుచుకున్నాడు.

తాజా ఎడిషన్‌లో భారత్‌కు ఇది ఐదో పతకం కాగా మొదటి రజతం. హాకీ జట్టుతో పాటు షూటింగ్‌లో 3 కాంస్యాలు వచ్చాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు