Home > TODAY IN HISTORY > NATIONAL UNITY DAY : జాతీయ ఐక్యతా దినోత్సవం

NATIONAL UNITY DAY : జాతీయ ఐక్యతా దినోత్సవం

BIKKI NEWS (అక్టోబర్ – 31) : జాతీయ ఐక్యతా దినోత్సవంను (NATIONAL UNITY DAY) భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం అక్టోబర్ 24 – 2014న ప్రకటించింది.

గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నది తీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు.

ఈ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సంబంధ కార్యాలయాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను చేస్తారు.

స్వాతంత్రం వచ్చేనాటికి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భారత ఉపఖండాన్ని ఏకీకరణ చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. జాతిని సమైక్యపరచి భారతదేశం అనే మహా రాజ్య స్థాపనలో కీలకమైన చర్యలు ఉపప్రధానిగా, హోమ్ మంత్రిగా చేపట్టి భారతదేశంను సమైఖ్యపరిచాడు.