Home > JOBS > MPHA JOBS CANCELLED – 1200 ఎంపీహెచ్‌ఏ ఉద్యోగాలు రద్దు – హైకోర్టు

MPHA JOBS CANCELLED – 1200 ఎంపీహెచ్‌ఏ ఉద్యోగాలు రద్దు – హైకోర్టు

BIKKI NEWS (DEC. 01) : Multi Purpose Health Assistant Appointments cancelled by High court. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ నోటిఫికేషన్‌ 2002 లో నియమాకాలను హైకోర్టు రద్దు చేసింది. అర్హతలతో జాబితా తయారు చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని తీర్పు వెలువరించింది.

Multi Purpose Health Assistant Appointments cancelled by High court

ఈ నోటిఫికేషన్‌లో అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు వెలువరించిన తరువాత కూడా ప్రభుత్వం జీవో 1207 ద్వారా 1200 మందిని అడ్డదారిలో నియామకాలు చేసిందని తప్పుపట్టింది.

కోర్టు తీర్పుల తర్వాత కూడా ప్రభుత్వం దొడ్డిదారిన జీవో ఇచ్చి నియామకాలు చేయడాన్ని రద్దు చేసింది. అర్హతలతో జాబితా తయారు చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని తీర్పు వెలువరించింది.

తమ తీర్పు వెలువడిన 90 రోజుల్లోగా అర్హులతో జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది.

దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చి నియామకాలు చేయడం చెల్లదని తేల్చి చెప్పింది.

కోర్టు తీర్పు తర్వాత తొలగించిన 1200 మందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ 2002లో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 1207 జారీ చేయడం చట్టవిరుద్ధమని వెల్లడించింది. కోర్టు తీర్పులను అమలు చేయకపోగా ఆ తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వ జీవో ఉన్నదని ప్రకటించింది. కోర్టు తీర్పుల తర్వాత వాళ్లనే తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో అనేక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది.

జీవో 1207 మేరకు జరిగిన 1200 మంది ఎంపీహెచ్‌ఏల నియామకాలను తాము సమర్థిస్తే ప్రభుత్వం చేసిన తప్పునే తాము కూడా చేసినట్టు అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే జీవో 1207 ప్రకారం భర్తీ చేసిన 1200 మంది ఎంపీహెచ్‌ఏల నియామకాలను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సుజయ్‌ పాల్‌, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది.

హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత 1200 మందిని తొలగించిన ప్రభుత్వం తిరిగి వారినే కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు