BIKKI NEWS (APRIL 15) : తెలంగాణ రాష్ట్ర జనాభాలో 10% గా ఉన్న ముదిరాజ్ లను బీసీ – A కేటగిరీలోకి మార్చడానికి కృషి చేస్తానని (MUDIRAJ CATEGORY WILL CHANGE TO BC -A FROM BC – D) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ముదిరాజ్ లు బిసి-డి కేటగిరి లో ఉన్నారు. వీరికి సరైన న్యాయం జరగాలంటే బీసీ – ఏ కేటగిరీలో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మంచి లాయర్లను పెట్టి, సుప్రీంకోర్టులో వాదించి, బీసీ ఏలో ముదిరాజులను చేర్చడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.