BIKKI NEWS (AUG. 01) : MUCCHARLA IS 4th CITY IN TELANGANA. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
MUCCHARLA IS 4th CITY IN TELANGANA
ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటి వాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ వద్ద నెట్‌జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్‌లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ నాలుగో నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు.
ఈ ప్రాంతంలో భూమి కోల్పోయిన ప్రజలు అధైర్యపడొద్దు. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుంది.
ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుంది.
న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించడం.
ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలును విస్తరించడం, ఆ తర్వాత దాన్ని నెట్ జీరో సిటీ వరకు పొడగించడం.
ఆ ప్రాంతం వరకు 200 అడుగులతో రోడ్డు మార్గాన్ని నిర్మించడం.
వచ్చే మూడు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టడం.
స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిందంటే కచ్చితంగా ఉద్యోగం లభించే ప్రణాళికలు.
నాలుగో నగరంగా ఏర్పడటానికి కీలకమైన విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించి ముచ్చర్లను ఫ్యూచర్ సిటీగా మార్చడం.