BIKKI NEWS : లోహాలు – వాటి విశేషాలు metals and their uses in telugu. పోటీ పరీక్షల నేపథ్యంలో సైన్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉండడంతో, వివిధ మూలకాలు మరియు లోహాలు వాటి యొక్క ఉపయోగాల గురించి సంక్షిప్తంగా సమాచారం నీ కోసం…
Metals And Their Uses In Telugu
కాల్షియం :- శరీర నిర్మాణానికి కావాల్సిన లోహం, శరీరంలో అధికంగా ఉండే లోహం
బంగారం :- అత్యధిక సాగే గుణం ఉన్న లోహం
వెండి :- అత్యధిక విద్యుత్ వాహక, ఉష్ణ వాహక లోహం
అల్యూమినియం :- భూమిలో ఎక్కువగా లభించే లోహం
మెగ్నీషియం :- ఆకుల పత్ర హరితంలో ఉండే లోహం
నికెల్ :- నూనెల హైడ్రోజనీకరణంలో వాడే లోహం
జిర్కోనియం :- వేడి చేస్తే సంకోచం చెందే లోహం
పాదరసం :- వేడి చేస్తే వ్యాకోచించే లోహం
గాలియం :- వేసవి ద్రవం అనే పేరున్న లోహం
లిథియం :- అతి తేలికైన లోహం
టైటానియం :- ఉక్కులో సగం బరువు ఉండి దానికి సమాన గట్టిదనం ఉండే లోహం
మాంగనీసు :- మానవ శరీరంలో తక్కువగా ఉండే లోహం, ప్రత్యుత్పత్తికి అవసరం.
కోబాల్ట్ :- విటమిన్ బి12 లో ఉండే లోహం
ఇనుము :- హేబర్ విధానంలో ఉపయోగించే ఉత్ప్రేరకం.
రేడియం :- అత్యధిక రేడియోధార్మికత గల లోహం
టంగ్ స్టన్ :- అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం
ఫ్లోరిన్ :- అత్యల్ప లోహ స్వభావం గల మూలకం
ఆస్మియం :- అత్యధిక సాంద్రత గల లోహం
నైట్రోజన్ :- గాలిలో అత్యధికంగా ఉండే వాయువు
యురేనియం :- ప్రకృతిలో లభించే అతి భారమైన మూలకం
హైడ్రోజన్ :- అతి తేలికైన వాయువు
డైమండ్ :- ప్రకృతిలో లభించే అతి కఠినమైన మూలకం
హీలియం :- అత్యధిక అయనీకరణ శక్తి గల మూలకం
ఫ్లోరిన్ :-అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం
ఆక్సిజన్ :- భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం
కార్బన్ :- అత్యధిక కాటనేషన్ సామర్థ్యం గల మూలకం