Home > JOBS > DSC (TRT) > MEGA DSC – 9,800 టీచర్ ఉద్యోగ ఖాళీలు

MEGA DSC – 9,800 టీచర్ ఉద్యోగ ఖాళీలు

BIKKI NEWS (DEC. 16) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9,800 టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ (mega dsc with 9800 posts) ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని వెల్లడించారు.

గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ దరఖాస్తులు స్వీకరణ కూడా పూర్తి అయింది. ఇప్పటికే గత నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థికశాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జులైలో మంత్రివర్గ ఉప సంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలు సమర్పించింది. అందుకు భిన్నంగా 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయ్యింది. అంటే 4,281 పోస్టులకు కోత పడింది.

రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా.. ప్రస్తుతం 1,03,343 మంది పని చేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్ 70 శాతం, హెచ్ఎం ఖాళీలన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది.

గత నోటిఫికేషన్ సమయంలోనే పదోన్నతులు ద్వారా 1,947 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 2,162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్
హెచ్ఎం), మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని సర్కారు
స్పష్టం చేసింది.

విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తో పాటు గత అక్టోబరులో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ
లెక్కన 9,820 ఖాళీలు ఉన్నట్లు.

గత నోటిఫికేషన్ కు సుమారు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నియమావళి కారణంగా ఆన్లైన్ పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నారు.

ఖాళీల వివరాలు – నోటిఫికేషన్ లో ప్రతిపాదించిన ఖాళీలు

SGT : 6,360. — 2575
S.A. : 2,179. — 1,739
LPT : 669. —- 611
PET :. 162. —- 164

మొత్తం : 9,370 —- 5,089