BIKKI NEWS (JUNE 10) : Los Angeles protest. లాస్ ఏంజెలెస్‌లో ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (TRUMP) నేషనల్ గార్డును (National Guard) మోహరిస్తూ తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆదివారం నగరంలో భారీగా నిరసనలు వెల్లవెత్తాయి.
Los Angeles protest
మాస్కులు ధరించిన ఆందోళనకారులను అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశించారు. నిరసనలలో మాస్కులు ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర గవర్నర్ల పరిధిలో ఉండగా దాన్ని అతిక్రమిస్తూ లాస్ ఏంజెలెస్‌లోకి నేషనల్ గార్డు బలగాలను ట్రంప్ మోహరించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
లాస్ ఎంజిల్స్ లో వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు ప్రధాన మార్గాన్ని మూసివేసి కార్లకు నిప్పుపెట్టగా వారిని చెదరగొట్టేందుకు నేషనల్ గార్డు బలగాలు బాష్పవాయు గోళాలను, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి.
డజన్ల కొద్దీ అక్రమ వలసదారులు, నేరపూరిత ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.
అమెరికాలోనే రెండవ అతి పెద్ద నగరమైన లాస్ ఏంజెలెస్‌లో నిరసనలను అదుపు చేయడానికి ట్రంప్ నేషనల్ గార్డు బలగాలను పంపించడంతో పరిస్థితి అదుపుతప్పింది.
- TG TET 2025 HALL TICKETS
- Los Angeles – లాస్ ఎంజిల్స్ లో భారీ నిరసనలు
- ICC HALL OF FAME – ధోనీ తో పాటు ఆరుగురికి చోటు
- DAILY GK BITS IN TELUGU JUNE 10th
- చరిత్రలో ఈరోజు జూన్ 10