BIKKI NEWS (JULY 05) : land rates adjustment in telangana. మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
Land Rates Adjustment In Telangana
స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్స్ శాఖపై శుక్రవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఉన్న భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు.
బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలని సూచించారు. ఏఏ ప్రాంతాలలో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉందనే అంశాలపై లోతైన అధ్యయనం చేయాలన్నారు.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు గంటల తరబడి వేచిచూసే పరిస్థితి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. ఇందుకోసం అవసరమైన భూములను అధికారులు గుర్తించాలని, రిజిస్ట్రేషన్లకు టైమ్ స్లాట్ అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు.
ఉద్యోగుల బదిలీలను కూడా పారదర్శకంగా నిర్వహిస్తామనితెలిపారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఆన్లైన్ పద్ధతిలో చేపట్టడానికి ఉత్తర్వులు జారీ చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.