BIKKI NEWS (డిసెంబర్ 21) : ప్రముఖ తెలుగు రచయిత తల్లవజ్ఞుల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2023 (KENDRA SAHITYA AKADEMI AWARDS 2023) లభించింది.
2023 ఏడాదికి సంబంధించి 24 భాషల సాహితీకారులను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేశామని అకాడమీ కార్యదర్శి శ్రీనివాస రావు బుధవారం ప్రకటించారు.
తెలుగులో ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ రచనకు గాను తల్లవజ్ఞుల పతంజలి శాస్త్రికి ఈ అవార్డు అందిస్తున్నట్టు తెలిపారు.
1945లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో జన్మించిన పతంజలి ఒంగోలులో విద్యనభ్యసించారు. లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఆయన పతంజలి శాస్త్రి కథలు, వడ్ల చిలుకలు లాంటి కథా సంపుటాలు వెలువరించారు.
మొత్తం తొమ్మిది కవితా సంపుటాలు, ఆరు నవలలు, ఐదు చిన్న కథల సంపుటాలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనానికి ఈ అవార్డులు దక్కాయి.
ముఝే పెహ్‌చానో నవలకుగాను సంజీవుకు, రెకియమ్ ఇన్ రాగా జానకి పుస్తకానికిగాను నీలం సరణ్ గౌర్ కు అవార్డు దక్కింది. టి.పతంజలి శాస్త్రి (తెలుగు), విజయ్ వర్మ(డోగ్రీ), వినోద్ జోషి (గుజరాతీ), బన్సూర్ బనిహరి (కశ్మీరీ), అరుణ్ రంజన్ మిశ్రా (సంస్కృతం) తదితరులు అవార్డులు పొందిన వారిలో ఉన్నారు.
వచ్చే ఏడాది మార్చి 12వ తేదీన ఢిల్లీలో వీరందరికీ అవార్డులను ప్రదానం చేసి రూ.1 లక్ష నగదు బహుమతి అందిస్తారు. తామ్ర ప్రశంసా పత్ర ఇచ్చి శాలువాతో సత్కరిస్తారు.