BIKKI NEWS (AUG. 27) : Journalism courses admissions 2024 in AP college of journalism. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వివిధ కోర్సుల్లో 2024-25 సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
Journalism courses admissions 2024 in AP college of journalism
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 06 – 2024 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల – అర్హతల వివరాలు
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (PGDJ):
కోర్సు వ్యవధి 12 నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి.
డిప్లొమా ఇన్ జర్నలిజం (DJ):
కోర్సు వ్యవధి ఆరు నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి.
డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం (DTVJ):
కోర్సు వ్యవధి ఆరు నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి.
సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం (CJ):
కోర్సు వ్యవధి మూడు నెలలు. కనీస విద్యార్హత పదో తరగతి ఉండాలి.
ఈ కోర్సుల్ని రెగ్యులర్ గానూ మరియు దూర విద్య విధానంలోనూ పూర్తి చేయొచ్చు. అలాగే ఆన్లైన్ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి నుంచే పాఠ్యాంశాలను లైవ్ లో వినవచ్చు.
ఇంగ్లిష్ లేదా తెలుగును బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.
ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారం పొందటానికి చివరి తేది : 2024, సెప్టెంబర్ 02.
అడ్మిషన్లు పొందటానికి చివరి తేది : 2024, సెప్టెంబర్ 06.