JOINT CSIR UGC NET 2024 JUNE – నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (MAY 02) : JOINT CSIR UGC NET 2024 JUNE NOTIFICATION – యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జూన్ 2024 మాసానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్ షిప్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షగా ఈ పరీక్ష ఉపయోగపడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహించనుంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా జూన్ 25, 26, 27వ తేదీలలో నిర్వహించనున్నారు.

అర్హతలు : 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. JRF కు 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

సబ్జెక్టులు :
1) కెమికల్ సైన్సెస్
2) ఎర్త్, అట్మాస్పియరిక్, ఓషియన్ & ప్లానెటరీ సైన్స్
3) లైఫ్ సైన్సెస్
4) మ్యాథమెటికల్ సైన్సెస్
5) ఫిజికల్ సైన్సెస్

పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు
ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు, 100 మార్కులు… పేపర్-2లో 100 ప్రశ్నలు, 200 మార్కులు కేటాయించారు.

దరఖాస్తు ఫీజు : 1150/- (EWS & OBC – 600/-, SC, ST, PH, 3rd GENDER – 325/-

దరఖాస్తు గడువు : మే 21 – 2024 సాయంత్రం 5.00 వరకు

ఫీజు చెల్లింపు తేదీ : మే 23 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : మే 25 నుంచి 27 – 2024 వరకు

పరీక్ష తేదీలు : జూన్ 25, 26, 27 – 2024న

పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://csirnet.nta.ac.in/