BIKKI NEWS (JULY 21) : JO BIDEN LEFT FROM US PRESIDENT ELECTIONS. అమెరికా అధ్యక్షుడు త్వరలో జరగబోయే అధ్యక్ష పదవి రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు దీనిపై తన త్వరలోనే వివరణ ఇస్తానని కూడా ప్రకటించాడు.
JO BIDEN LEFT FROM US PRESIDENT ELECTIONS
దేశ ప్రయోజనాలు మరియు తన డెమొక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుత అధ్యక్ష బాధ్యతలలో పూర్తి కాలం కొనసాగుతానని కూడా స్పష్టం చేశాడు.
ఇటీవల కాలంలో అధ్యక్ష పదవి రైసు నుండి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుండి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, మరియు కరోనా బారిన పడిన నేపథ్యంలో, వయోభారం కూడా కలిసి రావట్లేదని భావించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
త్వరలోనే డెమోక్రటిక్ పార్టీ తమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడే అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యాక్షురాలు కమల హారిస్ ఈ రేసులో ముందు ఉన్నట్లు సమాచారం. ఇటీవల కూడా ఒక సమావేశంలో కమల హరీస్ పై సమర్దురాలంటూ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.
మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ పై హత్యాచారం సంఘటన జరిగిన తర్వాత సమీకరణాలు వేగవంతంగా మారుతున్న విషయం తెలిసిందే. హత్యాచారానికి ముందు నువ్వా నేనా అన్నట్లు ఉన్న అధ్యక్ష ఎన్నికలు, సంఘటన తర్వాత డోనాల్డ్ ట్రంప్ వైపు పూర్తిగా మొగ్గు చూపునట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా జో బైడెన్ అధ్యక్ష పదవి రేసు నుంచి విరమించుకోవడానికి కారణం అయి ఉండవచ్చు.
కమల హారిస్ డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలో నిలిస్తే అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన తొలి భారత సంతతికి చెందిన మహిళగా రికార్డు సృష్టించనుంది.
అయితే డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలో ఎవరిని నిలుపుతారో త్వరలోనే వెలువలనుంది.