ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

BIKKI NEWS (SEP. 28) : Jangoan district TNGOs requesting collector for employees issues. జనగామ జిల్లా TNGOs’ యూనియన్ అధ్యక్షులు మరియు JAC చైర్మన్ ఖాజా షరీఫ్ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ గారిని ఉద్యోగుల సమస్యల పట్ల శుక్రవారం నాడు కలిసి ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియమకాలు, ఉద్యోగుల ఇండ్ల స్థలాల గురించి వినతిపత్రం అందజేశారు.

Jangoan district TNGOs Requesting collector for employees issues

ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ఖాజా షరీఫ్ గారు మాట్లాడుచు జిల్లాలో చాలా కాలం నుండి గ్రామ రెవెన్యూ అధికారులు 6 సంవత్సరల ఇంక్రిమెంట్స్ 12 సం ఇంక్రిమెంట్స్ మరియు ప్రొబేషన్ డిక్లర్ సంబంధించిన అంశాలపై సుధీర్గంగా చర్చించారు, అదేవిదంగా నూతన జనగామ జిల్లాలో ఉద్యోగులకు ఇండ్ల స్థలలు కొరకు జనగామ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఇప్పించినచో ఉద్యోగుల హోసింగ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తామని గౌరవ కలెక్టర్ గారికి వివరించారు.

అనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుచు పెండెంగ్ సమస్యలపై సెక్షన్ల వారిగా పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని, అదేవిదంగా ఇండ్ల స్థలములకు సంబంధించి రెవెన్యూ కలెక్టర్ గారికి ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి జిల్లాను అభివృద్ధి పదంలో ముందంచాలని, అదేవిధంగా VRO ల సమస్యలపై మాట్లాడుచు వివిధ శాఖలలో పని చేసున్న వారికి పని చేస్తున్న డిపార్ట్మెంట్ లొ ఇంక్రిమెంట్స్ తీసుకునే విధంగా ఆదేశాలు జరిగిన చేస్తా అని తెలిపారు, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చిన తమ ద్రుష్టి కి తీసుకరావాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, కోశాధికారి యండి హాఫిజ్, ఉపాధ్యక్షులు కొండ సంపత్ కుమార్, రామ్ నర్సయ్య, ఉప్పలయ్య, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ప్రచార కార్యదర్శి నాగార్జున, శ్రీధర్ బాబు, ప్రభాకర్, రమేష్, కృష్ణ,సిటీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, మధు, రమేష్, పాలకుర్తి యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు చందర్, యుగంధర్, స్టేషన్ ఘనపూర్ కార్యదర్శి సత్యనారాయణ, బచ్చన్నపేట కార్యదర్శి యాదగిరి, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి నామల పర్శరాములు, విష్ణు, జయలు, పాండు, రమాదేవి, షకీల్, తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD