జై భీమ్ ఫౌండేషన్ స్టిక్కర్ పోస్టర్ ఆవిష్కరణ

జనగాం/కళ్ళెం (Oct. 11) : Jai Bheem Foundation kallem. కళ్ళెం గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద జై భీమ్ ఫౌండేషన్ అధ్యక్షులు మబ్బు రాజు ఆధ్వర్యంలో దళితరత్న అవార్డు గ్రహీత, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు మబ్బు పరశురాం, PACS ఛైర్మన్ బుషిగంపల ఉపేందర్ గార్లు జై భీమ్ ఫౌండేషన్ స్టిక్కర్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

Jai Bheem Foundation kallem

ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ… భారత రాజ్యాంగం నిర్మాత, భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాజ్యాంగం పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు మరియు అణగారిన వర్గాల పిల్లలకు చదువు కోసం సహాయ సహకారాలు అందించేందుకు ఒక వేదికగా జై భీమ్ ఫౌండేషన్ ఉండాలి అని, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దళిత రత్న అవార్డు గ్రహీత డాక్టర్. సి.హెచ్.రాజమౌళి పాల్గొని యువత అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జై భీమ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మబ్బు నవీన్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు కన్నయ్య, స్నేహ యూత్ అసోసియేషన్ నాయకులు శాడ రాజ్ కుమార్, శివాజీ ఫౌండేషన్ మరియు కమిటీ బాయ్స్ నాయకులు జయంత్, హరీష్, రాజు, కాలనీ ఫ్రెండ్స్ బొట్ల వెంకటేష్, ఆటో యూనియన్ నాయకులు మల్లయ్య, సురేష్, పరమేష్, రాంబాబు, శ్రీశైలం మరియు సీనియర్ నాయకులు మబ్బు నర్సయ్య, కొత్తపేట భాస్కర్, నక్కీర్త కరుణాకర్, వివిధ పార్టీల నాయకులు, జై భీమ్ ఫౌండేషన్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని స్టిక్కర్ పోస్టర్ కార్యక్రమం విజయవంతం చేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు