Home > SCIENCE AND TECHNOLOGY > CHANDRAYAAN 3 > Indian On Moon – 2040 కల్లా చంద్రుడిపైకి భారతీయుడు

Indian On Moon – 2040 కల్లా చంద్రుడిపైకి భారతీయుడు

BIKKI NEWS (DEC. – 13) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)..2040 నాటికి చంద్రుడిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దించుతామని (Indian On Moon,) సంస్థ చైర్మన్ ఎస్. సోమనాథ్ మంగళవారం తెలిపారు.

రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు అని వివరించారు. గగన్ యాన్ ప్రాజెక్టు ద్వారా రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనుందని తెలిపారు. దీనికింద ఇద్దరు లేదా ముగ్గురు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపుతామన్నారు. మూడు రోజుల తర్వాత వారు భూమికి తిరిగొస్తారని చెప్పారు.

వీరు ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారని తెలిపారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని సాకారం చేయాలని ప్రధాని మోదీ నిర్దేశించినట్లు తెలిపారు. శుక్రుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని, అంగారకుడిపైకి ల్యాండర్ ను ప్రయోగించాలనీ సూచించినట్లు పేర్కొన్నారు.