Home > CURRENT AFFAIRS > AWARDS > ISRO – LEIF ERIKSON LUNAR PRIZE

ISRO – LEIF ERIKSON LUNAR PRIZE

BIKKI NEWS (DEC. 21) : చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకుగాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు ఐస్‌లాండ్ లోని హుసావిక్లో గల ఎక్స్ రేషన్ 2023 మ్యూజియం లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్’ను (LEIF ERIKSON LUNAR PRIZE 2023) అందజేసింది.

ఇస్రో పంపిన అంతరిక్ష నౌక ఈ ఏడాది ఆగస్టు నెలలో మొట్టమొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగు జరిపిన విషయం తెలిసిందే. “చంద్రుడి గురించి అన్వేషణను ముందుకు తీసుకువెళ్లడంలో, ఖగోళ రహస్యాల ఛేదనలో ఇస్రో తిరుగులేని స్ఫూర్తిని ప్రదర్శించింది” అని ఐస్‌లాండ్ రాజధాని రెయివిక్లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా తెలిపింది.

ఇస్రో తరపున భారత రాయబారి బి. శ్యాం ఈ వార్షిక అవార్డును అందుకొన్నారు. ఈ సందర్భంగా ఐస్‌లాండ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ ఓ వీడియో సందేశం పంపారు.