BIKKI NEWS (JUNE 23) : IPC 420 CASE ON NO NUMBER PLATE VEHICLES. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపినా, ఉద్దేశపూర్వకంగా నంబర్ కనబడకుండా చేసినా అలాంటి వాహనాలపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
ప్లేట్ ను వంచినా, ముసుగును వేసినా కేసు నమోదు చేయనున్నారు. ఈమేరకు తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పొలీస్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
IPC 420 CASE ON NO NUMBER PLATE VEHICLES
ఇటీవల వాహనదారులు నంబర్లు కనిపించకుండా నడుపుతున్న 85 వాహనాలను గుర్తించామని వెల్లడించారు. అందులో 35 మంది ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేసినట్లు గుర్తించి వారిపై 420 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మైనర్లకు వాహనాలు ఇచ్చినా ఎంవీ యాక్ట్ 177/180 కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే మూడు నెలల జైలు, లేదా రూ. ఐదు వేల జరిమానా ఉంటుందన్నారు.
FOLLOW US
@YOUTUBE
@TELEGRAM
తాజా వార్తలు
వాహనదారులు ముఖ్యంగా బైక్ ఉన్న వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్లను వంచడం లేదా నెంబర్ కనిపించకుండా ముసుగు వేయడం లేదా నెంబర్ ను చెరిపి వేయడం వంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. దీంతో వాళ్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన చలాన్లు వేయడం పోలీసులకు కష్టమవుతుంది.
నెంబర్ ప్లేట్ ట్యాపింగ్ తో చలాన్ లో పడవని ధైర్యంతో వాహనదారులు యదేచ్చగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి దీనివల్ల యాక్సిడెంట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి.
దీనివలన దొంగలను, ఆకతాయిలను పట్టుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చి నెంబర్ ప్లేట్ టాపింగ్ చేసిన వాహనదారులను ఐపిసి 420 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.