Home > SPORTS > INTERNATIONAL TENNIS HALL OF FAME 2024

INTERNATIONAL TENNIS HALL OF FAME 2024

BIKKI NEWS (DEC. 14) : భారత టెన్నిస్ దిగ్గజం, డబుల్స్ మాజీ నంబర్ వన్ లియాండర్ పేస్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ – 2024 లో చోటు (international tennis hall of fame 2024 – leander Paes and VijayAmritraj) దక్కించుకున్నారు. మరోవైపు ప్రమోటర్ విజయ్ అమృత్ రాజ్ కూడా భారత్ నుండి ఈ జాబితాలో చేరాడు. ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఇద్దరు పురుషులు వీళ్లే కావడం విశేషం.

టెన్నిస్ లోనే అత్యున్నత మైందిగా భావించే ఈ హాల్ ఆఫ్ ఫేమ్ లో ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ (యూకే)కు కూడా 2024 విభాగంలో స్థానం దక్కింది. 2024 హాల్ ఆఫ్ ఫేమ్ వర్గంగా పరిగణించే ఈ ముగ్గురిని అధికారికంగా జరిగే కార్యక్రమంలో ఈ జాబితాలో చేరుస్తారు.

ఇప్పటి వరకు 27 దేశాల నుంచి 264 మంది ఇందులో ఉన్నారు. ఇందులో చోటు దక్కించుకున్న 28వ దేశంగా భారత్ నిలిచింది.

మూడు దశాబ్దాల కెరీర్ లో పేస్.. పురుషుల డబుల్స్ 8, మిక్స్డ్ డబుల్స్ లో 10 టైటిళ్లు సాధించాడు. వరుసగా ఏడు ఒలింపిక్స్ ఆడాడు. టెన్నిస్ ఒలింపిక్ పతకం (1996లో సింగిల్స్ కాంస్యం) సాధించిన ఏకైక భారత ఆటగాడు అతనే.