Home > TODAY IN HISTORY > DANCE DAY : అంతర్జాతీయ నృత్య దినోత్సవం

DANCE DAY : అంతర్జాతీయ నృత్య దినోత్సవం

BIKKI NRWS (APRIL- 29) : అంతర్జాతీయ నృత్య దినోత్సవం (International dance day april 29th) 1982లో యునెస్కో అనుబంధ సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీచే ప్రారంభించబడింది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవం అన్ని ఐక్యరాజ్యసమితి దేశాలు జరుపుకుంటాయి.

ఆధునిక బ్యాలెట్ సృష్టికర్తగా ప్రసిద్ధి చెందిన జీన్-జార్జెస్ నోవెర్రే (1727-1810) జన్మదినాన్ని పురష్కరించుకుని ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు.

ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం నృత్య కళారూపం ప్రపంచీకరణను సాధించడానికి, అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులు అధిగమించడానికి, సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయడం. ప్రపంచ నృత్య కూటమి దాని నృత్య కమిటీ ఈ దినాన్ని పారిస్ లోని UNESCO లోనూ, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.