ఇంటర్మీడియట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకై వినతి

BIKKI NEWS (AUG. 24) : Intermediate Out Sourcing employees job Security issue. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న 78 మంది అవుట్ సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈరోజు సంఘ రాష్ట్ర నాయకుడు పీ. కరుణాకర్ ఎమ్మెల్సీ కోదండరాం ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.

Intermediate Out Sourcing employees job Security issue

ఈ సందర్భంగా తాము గత 16 సంవత్సరాల నుండి ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగం చేస్తున్నామని, కనీసం జీతాలు కూడ టైం కి రావడం లేదని ప్రొఫెసర్ కోదండరాం గాలి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. కావునా తమకు వెంటనే ఉద్యోగ భద్రతా కల్పించాలని, ఈ విషయం ను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్, 78 మందిలో 26 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్/జూనియర్ అసిస్టెంట్ మరియు 52 మంది ఆఫీస్ సబార్డినేట్ లు గా పని చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం గారు స్పందిస్తూ… తప్పనిసరిగా మినిమం టైం స్కేల్ మరియు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రయత్నం చేస్తానని, ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగిందని పీ. కరుణాకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలల ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ స్టేట్ ప్రెసిడెంట్ జేఎసీ అధ్యక్షుడు పి. కరుణాకర్, వైస్ ప్రెసిడెంట్ మరియు నిర్మల, శంకర్, శ్రీనివాస్, పద్మ,, ప్రసాద్, కన్నయ్య, మల్లేష్, ముస్తపా తదితరులు సుమారుగా 30 మంది ఎమ్మెల్సీ కోదండరాం గారిని కలవడం జరిగింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు